TG : తెలంగాణలో మొబైల్ డిసీజ్ టెస్టింగ్ ల్యాబ్స్

వర్షాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాధులను సత్వరమే అరికట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. వర్షాకాలంలో పెరిగే అంటు వ్యాధులతో సహా సీజనల్ వ్యాధులు ప్రజలకు ప్రమాదకరంగా నిలవనున్నాయి. దీంతో ఆ వ్యాధులు ఒకేసారి చాలా మందికి సంక్రమించకుండా ఉండేందుకు ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది.
జాతీయ ఆరోగ్య మిషన్ సహ కారంతో ముందుకు వెళ్లేందుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తోంది. ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఊరూరా హెల్త్ చెకప్స్ క్యాంపులు నిర్వహించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జీవనశైలి వ్యాధులను ముందస్తుగా గుర్తించి వాటిని అడ్డుకునేలా ఊరూరా హెల్త్ చెకప్స్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని 26-70 ఏళ్ల వయ సున్న అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించబోతుంది. ఇందుకోసం అవసరమైన వైద్య పరికరాలతో కూడిన మొబైల్ ల్యాబ్ లను సిద్ధం చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమంలో భాగంగా నిర్వహించ బోయే ఈ కార్యక్రమానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర సర్కార్ 40 శాతం నిధులు సమకూర్చనున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆయా వ్యాధులను నిర్ధారించి వాటికి సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com