TS : ఇవాళ హైదరాబాద్ కు మోదీ.. షెడ్యూల్ ఇదే..!

లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) గడువు సమీపిస్తుండటంతో తెలంగాణపై బీజేపీ (BJP) హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మెజార్టీ లోక్ సభ సీట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత అమితా వచ్చి వెళ్లారు. అంతకుముందు ప్రధాని మోదీ కూడా రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంతో పాటు పార్టీ బహిరంగ సభల్లోనూ పాల్గొని వెళ్లారు. ఇప్పుడు మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో ప్రధాని మోడీ (PM Modi)... శుక్ర, శనివారం రెండు రోజులు వరుసగా పర్యటించనున్నారు. ఈమేరకు మోడీ షెడ్యూల్ ఖరారు అయింది.
శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఆయన చేరుకోనున్నారు. రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటలకు చేరుకొని మల్కాజిగిరి నియోజకవర్గంలోని మిర్జాలగూడలో 1.2 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్లో బీజేపీ ముఖ్యనేతలతో కలిసి ఆయన పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 6.40 గంటలకు రాజ్భవన్కు చేరుకొని రాత్రి అక్కడే బస చేయనున్నారు. శనివారం ఉదయం 10.45 గంటలకు రాజభవన్ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 11 గంటలకు చేరుకోనున్నారు.
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూలు మోడీ వెళ్లనున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేసే ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తిరిగి ఒంటిగంటకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గాకు తిరుగు ప్రయాణం కానున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి ఆయన తిరిగి ఈనెల 18న జగిత్యాలలో నిర్వహించే ఎన్నికల సభలో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com