TS : నేడు తెలంగాణకు మోదీ... నారాయణపేట, హైదరాబాద్‌లో సభలు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఫరిధిలోని నారాయణపేట, హైదరాబాద్‌లో జరిగే జనజాతర సభల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఆయన భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నాయకులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు నారాయణపేటకు చేరుకోనున్నారు మోదీ . నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో మోడీ పాల్గొనున్నారు. సభ అనంతరం సాయంత్రం 5.10 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించున్నారు.
అనంతరం సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట నుంచి భవనేశ్వర్ కు పయనం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నగరానికి వస్తున్న నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com