PM Modi : వేములవాడకు ప్రదాని మోడీ రాక.. తొలి ప్రధానిగా రికార్డ్

మే 8నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణలోని వేమువాడకు వస్తున్నారు. దీంతో.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ లేదా టూటైర్ నగరాల్లో పర్యటించి వెళ్లిపోతుంటారు. అలాంటిది మొదటిసారి తెలంగాణలోని ఓ ప్రముఖ శైవక్షేత్రానికి వస్తుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాత్రి ప్రధాని మోడీ హైదరాబాద్ కు వస్తారు. రాజ్ భవన్ లో బస చేసి రేపు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడకు చేరుకుంటారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ పర్యటనలో మోడీ వేములవాడ శివారులోని బాలనగర్ దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు. గుడి చెరువు ప్రాంగణంలోనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా మోడీ రికార్డులకు ఎక్కనున్నారు.
అనంతరం వరంగల్ ప్రచార సభకు హాజరవుతారు. వరంగల్ సభ నుంచి హైదరాబాద్ కు చేరుకొని ఢిల్లీకి ప్రయాణమవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com