Moinabad Drugs : మొయినాబాద్ డ్రగ్స్ కేసులో భారీ ట్విస్ట్..!

మొయినాబాద్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం రేపుతుందో మనందరం చూశారు. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టిడిపి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, అలాగే రితేష్ రెడ్డి, నమిత శర్మ, ప్రియాంక రెడ్డి లాంటి ప్రముఖులు ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. మహేష్ కు స్టేషన్ బెయిల్ రావడంతో ఆయన ప్రస్తుతం బయటే ఉన్నారు. అయితే ముందు చేసిన రాండం టెస్టులో మహేష్ కు నెగటివ్ వచ్చింది. కానీ తర్వాత చేసిన టెస్టులో పాజిటివ్ రావడంతో ఒక బీసీ నేతపై కుట్ర జరుగుతోందా అంటూ కొంతమంది ప్రచారం చేయడం మనం చూశాం. ఇక్కడ కొన్ని విషయాలు అందరూ గమనించాలి. వాస్తవానికి ఈ పార్టీ ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి మొదలైంది. కానీ పుట్టా మహేష్ పార్టీ మొదలైనప్పుడు లేరు.
కేవలం రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, ఇతరులు మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు. అప్పటికి ఒక పది సార్లు మహేష్ కు ఫోన్లు వెళ్లాయి. కానీ పుట్టా మహేష్ ఆలస్యంగా సాయంత్రం 7.30 గంటలకు ఆ పార్టీకి వెళ్లారు. అక్కడ ఉన్న ఏదో ఒక పఫ్ లాంటిది తీసుకున్నారు. ఈలోపు ఈగల్ టీంకు సమాచారం వెళ్లడంతో వాళ్లు అటాక్ చేసి వీళ్లందరినీ పట్టుకున్నారు. అయితే ఈగల్ టీం మీద రితేష్ రెడ్డి గన్ తో నమిత శర్మ కాల్పులు జరిపాడు. ఇది చాలా తీవ్రమైన పరిణామం. అయితే కాల్పులు జరపమని చెప్పింది రోహిత్ రెడ్డి. ఈ పార్టీలో పుట్టా మహేష్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాకపోయినా.. ఆయన చేసింది తప్పే కాబట్టి ఎవరైనా ఖండించాల్సిందే.
మొదట చేసిన టెస్టులో నెగిటివ్ వచ్చినా.. రెండోసారి బ్లడ్ టెస్ట్ లో మాత్రం పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే ఆయన ఆలస్యంగా పార్టీకి వెళ్లారు కాబట్టి తీసుకున్నవి బ్లడ్ లో చేరడానికి సమయం పట్టింది. అందుకే మొదటి చేసిన టెస్టులో నెగిటివ్ వచ్చింది. వాస్తవానికి పుట్టా మహేష్ బలమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. ఎంపీగా ఆయనకు మంచి పేరు ఉంది. కానీ వ్యక్తిగత వ్యసనాలు, అలవాట్ల కారణంగా ఆయన ఇమేజ్ కు మచ్చ తెచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి డ్రగ్స్ అలవాటు ఎవరికి ఉన్నా సరే దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. పార్టీపరమైన చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
