Morning 7AM News : మార్నింగ్ 7am షార్ట్ 15 న్యూస్.. ఫటాఫట్..!

Morning 7AM News  : మార్నింగ్ 7am షార్ట్ 15 న్యూస్.. ఫటాఫట్..!
Morning 7AM News : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని మార్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1. జాతీయ రాజకీయాలపై మరోసారి తమదైన శైలిలో స్పందించారు సీఎంకేసీఆర్. చాలా రంగాల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్న కేసీఆర్‌.. రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుండాలన్నారు. ఢిల్లీ దాక కొట్లాడి దేశాన్నిబాగుచేసుకోవాలన్నారు.

2. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. నాలుగు నియోజకవర్గాలకు సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టులను ప్రారంభించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు.

3. కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్రబీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని, ఇప్పుడు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.

4. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి స్టేట్‌మెంట్ సేకరణ కోసం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు.

5.జగన్‌మోహన్‌ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్సే లాస్ట్‌ ఛాన్స్‌ అయిందని… వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలు నష్టపోయాయని ఆయన వెల్లడించారు.

6.జగనన్న తోడు మూడో విడత సాయం అందజేత కార్యక్రమం వాయిదా పడింది. మంత్రి మేకపాటి హఠాన్మరణంతో ఇవాళ చేపట్టాల్సిన ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. -

7. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం జరగనుంది. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి సిద్దం అయ్యింది. రేపు సీఎం కేసీఆర్‌.... మల్లన్న సాగర్‌ను ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

8. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉన్నప్పటికీ ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

9. దేశంలోని పిల్లలకు మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. బయోలాజికల్‌-ఇ రూపొందించిన కోర్బెవాక్స్‌ టీకాకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది.

10. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని మార్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

11. హైదరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా ఆటకట్టించారు శంషాబాద్‌ ఎస్వోటీ పోలీసులు. ప్రధాన నిందితుడు విజయ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసిపది లక్షలకు పైగా నగదుతోపాటు 14 మొబైల్స్‌, నోట్‌ ప్యాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

12. వేసవికి ముందే శ్రీశైలం డ్యామ్‌ అడుగంటిపోవడంతో రాయలసీమకు తాగుసాగు నీటి కష్టాలు ముంచుకొస్తున్నాయి. శ్రీశైలం డ్యామ్‌ నీటిమట్టం ప్రస్తుతం 804 అడుగులకు పడిపోయింది.

13. ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్ల చేస్తున్నారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.

14. ఆర్ధిక సంక్షోభంతో.. శ్రీలంక అతలాకుతమవుతోంది. ఆ దేశంలో చమురు నిల్వలన్నీ ఖాళీ అయిపోయాయి. దీంతో పెట్రోల్‌ బంకుల్లో ఖాళీ బోర్డులు పెట్టారు. విదేశీ మారక నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతోనే.. శ్రీలంకకు ఈ పరిస్థితి దాపురించింది.

15. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. తూర్పు ఉక్రెయిన్‌లో సైన్యం, వేర్పాటువాదుల మధ్య ఘర్షణలతో.. టెన్షన్‌ వాతారవణం నెలకొంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుంచి ప్రయోగించిన ఓ మోర్టార్‌ షెల్ తమ బార్డర్‌ పోస్టును ధ్వంసం చేసిందని ఆరోపించింది రష్యా

Tags

Read MoreRead Less
Next Story