Mujra Party : మొయినాబాద్ ఫాం హౌస్ లో ముజ్రా పార్టీ భగ్నం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని నజీబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల సాగర్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో గత రాత్రి ఎస్ఓటి పోలీసులు దాడి చేసి (సెమీ న్యూరిటీ డాన్స్)ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో 6 మంది పురుషులు నలుగురు మహిళలు ఉన్నారు అందులో ఈ పార్టీని అరేంజ్ చేసిన ఈ నలుగురి విక్టిమ్స్ ను తీసుకవచిన్న వ్యక్తి రేహా సిద్ధ చౌహన్. ఈ వ్యక్తి ఈ పార్టీని అరేంజ్ చేసినట్టు అతనితోపాటు తన ఐదుగురి స్నేహితులను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో పార్టీని ఏర్పాటు చేశారని మొయినాబాద్ సీఐ తెలిపారు. ముగ్గురు మహిళలు ఢిల్లీ ప్రాంతానికి చెందినవారుగా హైదరాబాద్ లో స్థిరపడి డాన్సర్స్ గా వృత్తిని నిర్వహిస్తున్నారు మీరు హైదరాబాదులో స్థిరపడినట్టు పోలీసులు తెలిపారు. ఒక మహిళ హైదరాబాద్ ప్రాంతానికి చెందినది సింగర్ గా పనిచేస్తుంది తెలుస్తుంది. ఆరుగురు పురుషులు టోలిచౌకి ప్రాంతానికి చెందిన ముస్లిం మధ్యతరగతి వ్యక్తులు వీరు వృత్తిపరంగా మటన్ షాపులు నిర్వహింస్తుంటారు వ్యక్తులు గా నిర్ధారించారు పోలీసులు. వీరు ఎలాంటి మాదకద్రవ్యాలు సేవించలేదని కేవలం మద్యం మాత్రమే సేవించారని వారి నుంచి 3 మధ్య సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి ఆరుగురిని రిమాండ్ కు తరలించినట్లు నలుగురు మహిళలను రేస్క్యూ హోమ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు. అలాగే ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారం చేసే ఫామ్ హౌస్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏమైనా పార్టీలు అరేంజ్ చేసినప్పుడు తప్పకుండా పోలీస్ వారి పరిమిషన్ తీసుకోవాలని ఆయన కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com