Musi River Front : మూసీ రివర్ ఫ్రంట్.. మారనున్న సిటీ రూపురేఖలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్ మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో సిటీ రూపురేఖలు మారిపోనున్నాయి.
మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించటంతో స్థిరాస్థి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. గతంతో పోలిస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి, అంటే 2023 డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు ఏడు నెలల్లో ప్లాట్లు భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4670.52 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారిక లెక్కలు వెల్లడించాయి.
అంతకు ముందు ఏడు నెలల్లో అంటే మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు వచ్చిన ఆదాయం రూ.4429.23 కోట్లు, అంటే రూ.241.29 కోట్ల ఆదాయం పెరిగింది. రోజు రోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్లో స్థిరాస్థి రంగం వృద్ధికి ఇది సంకేతంగా అధికారులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com