TS : ‘నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ (KCR) అబద్ధాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దుయ్యబట్టారు. వాటిని ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ చీఫ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భయాందోళనలతో కేసీఆర్ పొలం బాట పట్టారని విమర్శించారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు.
కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు కేసీఆర్ సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్.. వారి హయాంలోనే కుప్పకూలిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతుందని చెప్పారు. సాగునీటి రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద నేతలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ‘నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో త్వరలోనే తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్లారు. వారి సర్కారు గొర్రెల స్కామ్ చేసింది. ఆ పార్టీ త్వరలోనే మొత్తం ఖాళీ కావడం ఖాయం’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com