Modi Tweet : మేడారం జాతర .. తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్

Modi Tweet : మేడారం జాతర ..  తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్

మేడారం జాతర సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం అని మోదీ ట్వీ్ట్ చేశారు.

ఫిబ్రవరి 21-24 తేదీల మధ్య నాలుగు రోజులు పాటు మేడారం జాతర జరగనుంది. ఈ జాతరకు సంబంధించి ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మేడారం జాతర కోసం నాలుగు వేలకు పైగా బస్సులను సిద్ధం చేసింది. ఈ జాతర కోసం ఏకంగా ఓ రైలునే ఏర్పాటు చేయడం విశేషం. ఈ రైలు కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు నడుస్తుంది.

మేడారం మహా జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో ప్ర భుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని తెలిపింది. ఈమేరకు జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీచేశారు. నాలుగు రోజులపాటు విద్యాసంస్థలను మూసి వేయాలని ఆదేశించారు. ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story