TS : తెలంగాణలో కొత్త రైల్వే లైన్ .. 11 స్టేషన్లను కలుపుతూ

TS : తెలంగాణలో కొత్త రైల్వే లైన్ ..  11 స్టేషన్లను కలుపుతూ

తెలంగాణలో (Telangana) కొత్త రైల్వే లైన్ పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది. ఎన్నో ఏళ్లుగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఇప్పుడు కార్యరూపం దాల్చడం వెనక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహం ఖచ్చితంగా ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 11 స్టేషన్లు కలుపుతూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుమతి ఇచ్చిందే తడువుగా రైల్వేశాఖ చర్యలు మొదలెపెట్టింది. డోర్నకల్ టు గద్వాల... కూసుమంచి నుంచి భూత్పూర్ వరకు ఈ లైన్ను నిర్మించనున్నారు.

ఇది ఎన్నికల సమయంలో తమకు రాజకీయంగా కొంత కలిసి వస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల మీదుగా మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) గతేడాది మంజూరుకు ప్రతిపాదించిన డోర్నకల్-గద్వాల రైలు మార్గానికి అతిత్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ లైన్ కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, నల్గొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, భూత్పూర్ తదితర ప్రధాన ప్రాంతాలను రైలు వసతితో కనెక్ట్ చేస్తుంది. దీని నిర్మాణానికి అవసరమైన తుది సర్వే మార్కింగ్ పనులు ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని మోతె మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి.

ఓవరాల్ గా డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం మీదుగా మోతె మండలం లోని కొత్తగూడెం మీదుగా సర్వే పనులు సాగుతున్నాయి. ఇప్పటికే మోతె మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లి సహా పలు గ్రామాల వద్ద రహదారి పాసింగ్లను గుర్తించి సర్వే బృందం మార్కింగ్ చేసింది. ఈ రైలు మార్గానికి ఎఫ్ఎల్ఎస్ సర్వే కోసం గతేడాది దక్షిణ మధ్య రైల్వే రూ.7.40 కోట్లు మంజూరు చేసింది. దాదాపు 296 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే లైను నిర్మాణానికి రూ. 5,330 కోట్ల వ్యయంతో అంచనాల ప్రతిపాదనలను రెడీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story