TS : నేను పార్టీ మారడం లేదు.. కడియం శ్రీహరి క్లారిటీ

X
By - Manikanta |13 March 2024 3:29 PM IST
తాను పార్టీ మారడం లేదని స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా కడియం శ్రీహరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వదంతులు వినిపించాయి. సీఎం రేవంత్ సమక్షంలో ఆయన పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై ఆయన స్పందించారు. కాగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కడియం తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7వేల779 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కేసీఆర్ ఫస్ట్ కేబినేట్ లో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com