TS : మజ్లిస్ ను ఓడించే దమ్ము ఎవరికీ లేదు : అసదుద్దీన్ ఒవైసీ

దేశవ్యాప్తంగా రాజకీయాల్లో నాటుకుపోతున్న మజ్లిస్ పార్టీని ఓడించే దమ్ము ఎవరికీ లేదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ సిటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ సెగ్మెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ, గత నలభై ఏళ్లుగా మజ్లిస్ వ్యతిరేకులు తమను ఓడించడానికి కుట్రలు పన్నుతున్నా, వారి ఆశలు అడియాశలుగానే మిగిలి పోతున్నాయన్నారు.
మజ్లిస్ పార్టీకి ఆది నుంచి బీజేపీ బద్ధ శత్రువు అన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన తమ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి ఘనతను చాటుకుందని చెప్పారు. నిరంతరం ఓటర్ల అభిమానమే మజ్లిస్ తనని గెలిపిస్తూ వచ్చిందన్నారు. తరాలుగా మజ్లిస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి దేశ అగ్రనేతలెవరూ పోటీ చేసినా ఓటమినే చవిచూడక తప్పదన్నారు. హైదరాబాద్ ప్రజల ప్రతిరూపమే మజ్లిస్ పార్టీ ఉందని ఆయన కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com