Nomination Post : సోయం బాపూరావుకు నామినేటెడ్ పోస్టు?

Nomination Post : సోయం బాపూరావుకు నామినేటెడ్ పోస్టు?

Adilabad ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావుకు (Soyam Bapurao) లోక్ సభ టికెట్ దక్కకపోవడంతో జాతీ య స్థాయిలో నామినేటెడ్ పోస్టు ను బీజేపీ అధిష్టానం ఆఫర్ చేసినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ బాపూరావుకు కాకుండా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గొడెం నగేష్ ను ఆదిలాబాద్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన విష యం తెలిసిందే.

దీంతో సోయం బాపూరావు పార్టీపై తీవ్ర అసం తృప్తిలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్న ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ లోకి వెళ్లకుండా బాపూరావుకు బీజేపీ నేతలు బుజ్జగిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయనకు నామినేటెడ్ పదవిని ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

త్వరలోనే కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీకి ఆయన వెళ్లను న్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నేషనల్ ఆర్గనై జింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోషను బాపూరావుకు కల్పిస్తానని కిషన్ రెడ్డి ఈమేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పార్టీ మారే ఆలోచనను సోయం బాపూరావు విరమించుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story