TG : లోటస్ పాండ్ లో కబ్జాలపై అధికారులు సీరియస్

TG : లోటస్ పాండ్ లో కబ్జాలపై అధికారులు సీరియస్
X

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ బఫర్ జోన్ లో నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ మండిపడ్డారు. గురువారం లోటస్ పాండ్ పరిసర ప్రాంతాల్లోని నిర్మాణాలను ఆయన పరిశీలించారు. చెరువుల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ భవన నిర్మాణ దారులను ఆయన హెచ్చరించారు.

అయితే లోటస్ పాండ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించి నిర్మాణ పనులు చేపట్టడంపై ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎ.వి.రంగనాథ్ ఆదేశించారు. చట్టానికి వ్యతిరేకంగా పని చేసే ఉద్యోగులపై కొరడా ఝుళిపిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఈవీడీఎం కమిషనర్ ఎ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గురువారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఆయన ఉక్కుపాదం మోపారు.

Tags

Next Story