Old City : హత్యలకు అడ్డాగా ఓల్డ్ సిటీ : ఎమ్మెల్యే రాజాసింగ్

ఓల్డ్ సిటీ హత్య లకు అడ్డాగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సెగ్మెంట్లోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయన్నారు. ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 4గంటల వరకు షాప్ లు, హోటళ్లు తెరిచే ఉంటున్నాయన్నారు.
దుకాణాలను బంద్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఎంపీ అసద్ పోలీసుల పై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఆయన చెప్పినట్లు పోలీసులు వినడమేం టని రాజాసింగ్ ప్రశ్నించారు. బాలాపూర్, శాలిబండ, బేగంపేట, మల్లేపల్లి, అసిఫ్ నగర్, కాలాపత్తర్, కాచిగూడ, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో దోపిడీలు జరుగుతున్నాయన్నారు.
'మేడ్చల్లో తెల్లవారుజామున పీఎస్ పక్కనే దోపిడీ, మర్డర్ చేశారు. భయం లేకపోవడం వల్లే ఇలాంటి నేరాలు జరుగు తున్నాయి. పాతబస్తీలో నేరాలను పోలీసులుకంట్రోల్ చేసేందు కానీ ఎంఐఎం నేతలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులు నేరాలను కంట్రోల్ చేస్తుంటే ఎంపీ అసదు బాధ ఎందుకు? పోలీసులపై ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం వారి ఒత్తిడికి భయపడుతున్నారు. సీఎం భయ పడొద్దు. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వాలి' అని రాజాసింగ్ కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com