TS : ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తోనే ఉంటా : పాడి కౌశిక్ రెడ్డి

తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ తోనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Paadi Kaushik Reddy) స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను పార్టీ మారడం లేదని, ఆ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ ప్రజలకు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఇవాళ పొద్దున్నే లేవగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూశాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరు తున్నట్లు ఒక వార్త వచ్చింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తో , వారి కుటుంబంతో ఉంటాను.
పార్టీ మారుతున్నట్లు ఇలాంటి చిల్లర వార్తలు దయచేసి రా యొద్దని జర్నలిస్టులను కూడా కోరుతున్నాను. ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులందరిపై లీగల్ చర్యలు తీసుకుంటాను. త్వరలోనే లీగల్ నోటీసులు పంపిస్తాను. పరువు నష్టం దావా కూడా వేస్తాను. ఇలాంటి చిల్లర వార్తలను ప్రజలు ఎవరూ నమ్మొద్ద ని విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఆయన ఆ వీడియోలో చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com