TG : పార్టీ మార్పుపై పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక ప్రకటన

బీఆర్ఎస్ నుంచి వలసలపై వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతటా చర్చ విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ లోకి 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ దానం నాగేందర్ ( Danam Nagender ) చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే పార్టీ మార్పుపై బీఆర్ఎఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పల్లా.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తోందని, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పార్టీ మారేందుకు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తన కుటుంబంపై ఎన్నో ఆక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు పల్లా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com