TS : హైవే రోడ్లపై పార్కింగ్ .. ఏటా 120 మంది బలి

తెలంగాణలో హైవే రోడ్లపై పార్కింగ్ ఏటా 120 మందికి పైగా ప్రాణాలకు బలి తీసుకుంటుంది. హైస్పీడ్ జోన్లుగా ఉన్న రహదారులపై పార్కింగ్ చేసిన వాహనాలు మరణాలకు ఉచ్చులుగా మారుతున్నాయి. 2018 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన ప్రమాదాల్లో 600 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 2022లోనే 331 ప్రమాదాలు జరగగా.. 128 మంది చనిపోయారు. ముఖ్యంగా తెల్లవారుజామున ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
రోడ్లపై పార్కింగ్, నివారణ చర్యలు లేకపోవడం, ఓవర్ స్పీడ్, డ్రైవర్లు అలసిపోవడం ఈ ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు ఇలాంటి పార్కింగ్‌ల పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఏమైనా సమస్య వచ్చి వాహనాలు రోడ్లపై నిలిచిపోతే ఇతర వెహికల్స్‌ను అలర్ట్ చేసేందుకు సెఫ్టీ ట్రయాంగిల్‌ను ఉపయోగించాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com