TS : పార్టీ మారేవారిని ప్రజలే చెప్పులతో కొడతారు: పల్లా

బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని ప్రజలే చెప్పులతో కొడతారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడేందుకే కొందరు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని సీరియస్ వార్ని్ంగ్ ఇచ్చారు.
పిరికి పందలు మాత్రమే పార్టీ మారుతున్నారని పల్లా ఘాటువ్యాఖ్యలు చేశారు. పార్టీ మారాలనుకునే వారు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు.వారి అక్రమాలను బీఆర్ఎస్ బయట పెడుతుందన్నారు. ఇక అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని.. సీఎం, మంత్రులు కనీసం రైతులను పరామర్శించలేదని పల్లా మండిపడ్డారు.
మరోవైపు ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు లేఖ అందజేసింది. వీరు బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొంది. కాగా తమ ఫిర్యాదుపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com