TS : ఫోన్ ట్యాపింగ్.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలనం

తెలంగాణ (Telangana) ఎన్నికల డెస్టినీ డిసైడర్ ఫోన్ ట్యాపింగ్ అంశం.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ (Union Minister Anurag Thakur) సంచలన వ్యాఖ్యలు చేశారు. టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాప్ చేసి ఉంటే కేంద్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే కంపల్సరీ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఠాకూర్. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఈ సారి రెండంకెల సీట్లు సాధిస్తామన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాటం చేసిందన్నారు. అందుకే తెలంగాణలో తమ ఓటు బ్యాంకు 7 శాతం నుంచి 14 శాతానికి పెరిగిందన్నారు. పునర్విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని.. గిరిజన యూనివర్సిటీకి భూమి ఇచ్చే విషయంలో కేసీఆర్ ఆరేళ్లు స్పందించలేదన్నారు.
తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని తమ నేతలు అనలేదని.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 మంది ఎమ్మెల్యేలు అవసరం అన్నారు. 8 మంది మాత్రమే ఉన్న బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలుగుతుందన్నారు అనురాగ్ ఠాకూర్. గతంలో కవితను అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారని అరెస్ట్ చేస్తే ఎందుకు చేశారని అంటున్నారని ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com