TS : తెలంగాణ రాజకీయం.. జంప్ చేసినవారికే గిరాకీ

TS : తెలంగాణ రాజకీయం.. జంప్ చేసినవారికే గిరాకీ

తెలంగాణలో (Telangana) ఎన్నికల రాజకీయం అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత అన్నట్లుగా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏ లీడర్ ఏ పార్టీలో ఉన్నాడన్నది కండువా వేస్తే గానీ అర్థంకాని పరిస్థితి. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండంకెల స్థానాలు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

అసెంబ్లీ పోరులో మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలని కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బిజెపి డబుల్ డిజిట్ సీట్లు సాధించేందుకు కసరత్తు చేస్తున్నాయి. రెండు పార్టీలకూ బీఆర్ఎస్ నేతలే బలమైన అభ్యర్థులుగా కనిపించారు.

తమ పార్టీ వారిని పక్కన పెట్టి పిలిచి మరీ టికెట్లు ఇచ్చాయి. సీనియర్లు, కొత్త అభ్యర్థులు అనే తేడా లేకుండా పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను గుర్తించి వారికి తమ పార్టీలోకి ఆహ్వానించి వెంటనే టికెట్లు ఇచ్చేశాయి. కాంగ్రెస్ లో రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి , దానం నాగేందర్ వంటి ఫిరాయింపుదారులకు టిక్కెట్ ఇచ్చారు. బీజేపీ పూర్తిగా ఫిరాయింపుల మీదనే ఆధారపడింది. పదిహేడు మంది లోక్ సభ అభ్యర్థుల్లో ఎనిమిది మంది నిన్నామొన్న పార్టీలో చేరిన వారే. ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. పిలిచిమరీ టికెట్లు ఇవ్వడం ఎంతవరకు ఓటర్లను ఆకట్టుకుంటుంది అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.

Tags

Read MoreRead Less
Next Story