TS : దా మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. రేవంత్ కు కేటీఆర్ సవాల్

TS : దా మల్కాజిగిరిలో  తేల్చుకుందాం.. రేవంత్ కు కేటీఆర్  సవాల్

TS : రాబోయే ఎంపీ ఎన్ని్కల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. రేవంత్ కు దమ్ముంటే సీఎం, కొడంగల్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని, తానూ సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందామని సవాల్ విసిరారు.గురువారం మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించిన కేటీఆర్‌ ఈ కామెంట్స్ చేశారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటములు చాలా సహజమని చెప్పిన కేటీఆర్ .. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సిల్లీ రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.

మేడిగడ్డ పర్యటనపై కేటీఆర్ స్పందించారు. ‘‘రేపు మేడిగడ్డ,అన్నారం పర్యటనకు వెళ్తున్నాం. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లు, అన్నారం బ్యారేజ్ లను పరిశీలిస్తాం. అన్నారం బ్యారేజ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తాం. కడియం శ్రీహరి, హరీష్ రావు ఇద్దరు రెండు బ్యారేజ్ లపై మాట్లాడుతారు. ప్రాజెక్టు కుంగడం.. ఇదేం కొత్తది కాదు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదంటూ మంత్రి ఉత్తమ్ కు హితవు పలికారు.

Tags

Read MoreRead Less
Next Story