BREAKING : విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు

ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తన పాత్ర ఏంటో వివరించాలని మాజీ సీఎం కేసీఆర్‌కు ( KCR ) పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందంపై ఈ నెల 30లోపు వివరణ ఇవ్వాలని సమన్లలో పేర్కొంది. కాగా జులై 30 వరకు తాను విచారణకు రాలేనని కేసీఆర్ తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నియమించింది తెలంగాణ సర్కార్.
ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్‌ఎస్ హయాంలో పని చేసిన కొందరు అధికారుల్ని విచారణకు పిలిచి.. వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది ఈ కమిషన్. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్‌రావును ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి.. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపించడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com