TG : మళ్లీ మొదలైన ప్రజావాణి.. సీఎం రేవంత్ సమీక్ష

TG : మళ్లీ మొదలైన ప్రజావాణి.. సీఎం రేవంత్ సమీక్ష
X

ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని పునః ప్రారంభించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జూన్ 7 శుక్రవారం నుంచి ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రజావాణిని తిరిగి ప్రారంభించడంతో.. సమస్యలతో జనం ప్రజా భవన్ కు వస్తున్నారు. ప్రజలు తమ తమ సమస్యలపై అర్జీ పెట్టుకోవడానికి ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు.

కొంత గ్యాప్ తర్వాత తిరిగి పెద్దసంఖ్యలో జనం వస్తుండటంతో.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకుంటున్నారు. వాటిని కంప్యూటరైజ్ చేస్తున్నారు. ఫిజికల్ పేపర్లను భద్రపరుస్తున్నారు.

చాలారోజుల తర్వాత ప్రజావాణి మొదలుకావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా భవన్ కు వచ్చారు. అర్జీ దారులనుంచి సమస్యలు అడిగితెలుసుకున్నారు.

Tags

Next Story