TG : బక్రీద్‌కు గోవధ జరగకుండా చూడండి: హైకోర్టు

TG : బక్రీద్‌కు గోవధ జరగకుండా చూడండి: హైకోర్టు
X

బక్రీద్ ( Bakrid ) వేళ గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గోవుల తరలింపును అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించింది. అక్రమంగా గోవులను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. జంతువధ చట్టం అమలులో ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.

బక్రీద్ వేళ గోవధను అడ్డుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఇలా స్పందించింది. జంతు వధ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్టులు పెట్టామని పోలీసులు తెలిపారు. గోవుల తరలింపుపై ఇప్పటికే 60 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

ముస్లింల ప్రధాన పండగలలో ఒకటి రంజాన్‌, రెండోది బక్రీద్.. బక్రీద్ ఈనెల 17వ తేదీ (సోమవారం) జరుపుకోనున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు. అందుకోసమని ఆ రోజున గోవధ భారీగా జరుగుతుంది. బక్రీద్ రోజు ముస్లింలు మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు

Tags

Next Story