PM Modi : శ్రీనగర్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ( Narendra Modi ) ఈ నెల 20న శ్రీనగర్ లో పర్యటించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోడీ ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ తన 'ఎక్స్' ఖాతాలో వెల్లడించారు.
“ఈ సంవత్సరం యోగా దినోత్సవ తేదీ సమీపిస్తోంది. యోగాను మన జీవితంలో అంతర్భాగంగా మార్చుకోవడానికి, ఇతరులను వారి జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించడం చాలా అవసరం" అని పోస్ట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలను యోగా ఏకం చేసిందన్నారు నరేంద్ర మోడీ. యోగాను తమ జీవితాల్లో చేర్చుకోవాలనే నిబద్ధతను పునరుద్ఘాటించాలని, ఇతరులను కూడా యోగా చేసేలా ప్రేరేపించాలని, యోగాను అలవాటుగా మార్చుకోవాలని మోడీ దేశ ప్రజలకు ప్రధానిమోడీ విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com