TS : ఇవాళ తెలంగాణలో ప్రియాంకా గాంధీ, అమిత్ షా

TS : ఇవాళ తెలంగాణలో ప్రియాంకా గాంధీ,  అమిత్ షా
X

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న ఆమె.. ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షోలో పాల్గొంటారు. ప్రియాంకతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆయా ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ ఫరిధిలోని వికారాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఫరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 57 రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు.

Tags

Next Story