Priyanka Gandhi : లేడీస్‌కు రూ.2500 ప్రకటించనున్న ప్రియాంక గాంధీ?

Priyanka Gandhi : లేడీస్‌కు రూ.2500 ప్రకటించనున్న ప్రియాంక గాంధీ?
X

తెలంగాణలో మూడు రోజుల పాటు కాంగ్రెస్ తురుఫుముక్క ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. ప్రియాంక గాంధీ ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నేటి సాయంత్రం హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ చేరుకుంటారు.

ఆమెకు విమానాశ్రయంలో కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు సాయంత్రం కూకట్‌పల్లిలో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొని అభ్యర్థి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు.

మే 8వ తేదన సాయంత్రం సికింద్రాబాద్ లో జరిగే రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఈ సభల్లో మహిళలకు నెలకు రూ.2500పై ప్రియాక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఎప్పటినుంచి ఇచ్చేది తేదీ ప్రకటిస్తే చాలనేది చాలామంది కాంగ్రెస్ ఆశావహుల అభిప్రాయం. ఆదివారం రాహుల్ గాంధీ ఇప్పటికే ఇస్తున్నట్టు ప్రకటించడంతో.. ప్రియాంకతో ఆ ప్రకటన ఇప్పించనున్నారు తెలుస్తోంది.

Tags

Next Story