Telangana Teachers Promotions : 18 వేల 942 మంది టీచర్లకు ప్రమోషన్లు

తెలంగాణలో 18,942 మంది టీచర్ల ప్రమోషన్ల కల నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మల్టీజోన్1లో 10,083 మంది SGTలు స్కూల్ అసిస్టెంట్లుగా, 1,094 మంది స్కూల్ అసిస్టెంట్లు HMలుగా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్2లో SGT నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 6,989 మంది, 776 మంది స్కూల్ అసిస్టెంట్లు HMలు అయ్యారు.
అయితే, టీచర్ల బదిలీలు, పదోన్నతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతులు, బదిలీల్లో 18 వేల 942 మంది టీచర్లకి ప్రమోషన్ , సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా 17 వేల 72 మందికి పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ గా 1870 మందికి పదోన్నతి లభించింది. ఇక, ఎస్జీటీ బదిలీలు మినహా టీచర్ల పదోన్నతి, బదిలీల ప్రక్రియ పూర్తి అయింది.
పదోన్నతుల కేటాయింపు విధానం :
మల్టీజోన్-1 (ప్రభుత్వ, స్థానిక సంస్థలు)
ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ - 10,083
స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రిన్సిపల్స్ - 1,094
మల్టీజోన్-2
ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ - 6,989
స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు - 776
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com