TG : మల్లారెడ్డి వర్సిటీ ఫుడ్ లో పురుగులు.. విద్యార్థుల ఆందోళన

TG : మల్లారెడ్డి వర్సిటీ ఫుడ్ లో పురుగులు.. విద్యార్థుల ఆందోళన
X

మల్లారెడ్డి యూనివర్సిటీలోని మరోసారి ఆహారంలో పురుగులు వచ్చాయటూ విద్యార్థుల ఆందోళన చేయడం సంచలనం రేపుతోంది. రాత్రి భోజనంలో పురుగులు ఉన్నాయంటూ ఆందోళనకు దిగారు మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

విద్యాసంస్థ మేనేజ్ మెంట్, నిర్వాహకులపై విద్యార్థులు తమ నిరసన తెలిపారు. పురుగులు పడిన ఫుడ్ పెడుతున్నారని తెలియడంతో విద్యార్థి సంఘాలు కూడా యూనివర్సిటీకి వచ్చి ప్రొటెస్ట్ నిర్వహించాయి.

యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులతో కలిసి NSUI నాయకులు ధర్నా చేశారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐతే.. ఈ కథనాలను సంస్థ యాజమాన్యం తోసిపుచ్చింది. ఇది రాజకీయ కుట్ర అని విమర్శించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందిస్తున్నామని.. పొరపాట్లు జరిగితే దర్యాప్తు చేసి సరిదిద్దుకుంటామని తెలిపింది.

Tags

Next Story