TG : ప్రజలకు ఇబ్బందులు కలిగితే సహించబోం : గద్వాల విజయలక్ష్మి

జిహెచ్ఎంసి ప్రజలకు ఇబ్బందులు కలిగితే సహించబోమని, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో మంగళవారం శేరిలింగంపల్లి జోన్ - యూసూప్ గూడ సర్కిల్ బొరబండ డివిజన్ కు సంబంధించిన అభివృద్ది పనులపై సంబంధిత GHMC అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్, ఎంటమాలజీ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ అధికారులతో బోరబండ కార్పొరేటర్ మొహమ్మద్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లడుతూ ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎవరి పని వారు చేస్తూ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బొరబండ డివిజన్ లో పెండింగులో ఉన్న కమ్యూనిటీ హాళ్లనిర్మాణం సీసి రోడ్డు పనులు, బొరబండ ప్రధాన రోడ్డు వైండింగ్, వీధిదీపాల నిర్వహణ, శానిటేషన్ నిర్వాహన తదితర అంశాలపై ఆయా విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో ఏ ఒక్క ప్రాణ నష్టం జరగవద్దని, షార్ట్ సర్క్యూట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అన్ని ట్రాన్స్ఫార్మర్స్ వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా గుర్తించిన డార్క్ ఏరియాలలో వీధిలైట్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గంజాయి,డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలని, అందుకు పోలీసు శాఖ సహకారంతో అనుమానిత ఏరియాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంచినిటి కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని, నీటిని వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com