TG : రఘునందన్‌కు హరీశ్ రావు కంగ్రాట్స్.. ఒకే వేదికపై ఇద్దరు

తెలంగాణ రాజకీయాల్లో వారిద్దరు ఉద్దండులు. వారికి పార్టీలో, ప్రజల్లో క్రేజ్ మామూలుగా ఉండదు. ఒకరంటే ఒకరికి గిట్టదు. అలాంటిది ఆ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సన్నవివేశంగా మారింది.
సిద్దిపేట జిల్లాలో ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులుగా ఉండి మాటల తూటాలతో బాంబులు పేల్చే నేతలు... బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒకే వేదికను పంచుకున్నారు. వేదికను పంచుకోవడమే ఎంపీగా గెలుపొందిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మాజీ ముద్ర హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవలి ఎంపీ ఎన్నికల్లో ఈ ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అలాంటిది ఆ ఇద్దరు నేతలు బుధవారం ఎదురెదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు. సిద్దిపేటలో శివపార్వతుల కల్యాణంలో బుధవారం ఈ ఇద్దరు కలిసి పాల్గొన్నారు. పక్కన కూర్చున్నారు. ఈ సన్నివేశాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com