TS : తెలంగాణలో రాహుల్, ప్రియాంక ప్రచార షెడ్యూల్ ఫిక్స్

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ఈనెల 5,9న.. ప్రియాంకా గాంధీ 5,7,9న ప్రచారం నిర్వహించనున్నారు. 5న నిర్మల్, గద్వాల్, 9న కరీంనగర్, సరూర్‌నగర్ సభల్లో రాహుల్ పాల్గొంటారు. 6న ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్, 7న నర్సాపూర్, కూకట్‌పల్లి సభలకు ప్రియాంక హాజరవుతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, రోడ్ షోలు ఉంటాయని బుధవారం కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థులపై నేడు స్పష్టత రానుంది. 30 గంటల్లోపు అభ్యర్థులను ప్రకటిస్తామని నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. రేపటి వరకు సమయం ఉందని.. అభ్యర్థులు ఎవరనే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు. పార్టీ చీఫ్ ఖర్గే ఒక నిర్ణయానికి వచ్చే వరకు ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com