TS : రాహుల్ గాంధీ రిజర్వేషన్ల సినిమా ఫ్లాప్

TS : రాహుల్ గాంధీ రిజర్వేషన్ల సినిమా ఫ్లాప్

రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలంతా కలిసి చేసిన విద్వేష రిజర్వేషన్ల దుష్ప్రచారం ఎవరూ నమ్మడంలేదన్నారు కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు. రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మడం లేదన్నారు.

రాహుల్, రేవంత్ మాటలను లైట్ గా తీసుకుంటున్నారన్నారు కిషన్ రెడ్డి. ఎన్ని ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసినా బీజేపీకి, తనకు ఎలాంటి ఢోకా లేదని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ సభ నేపథ్యంలో గురువారం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు.

కాంగ్రెస్ మోడీపై చేస్తున్న విమర్శలను పట్టించుకునేవాళ్లే కరువయ్యారన్నారు బీజేపీ నేతలు. మోడీపై అచంచల విశ్వాసం జనంలో ఏర్పడిందన్నారు. కేసీఆర్ మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకో వడం లేదని, నవ్వుకుంటున్నారని కాషాయ లీడర్లు ఎద్దేవాచేశారు.

Tags

Next Story