TS : తెలంగాణ ఈ జిల్లాల్లో వర్ష సూచన.. ఆ తర్వాత ఎండలే!

TS : తెలంగాణ ఈ జిల్లాల్లో వర్ష సూచన.. ఆ తర్వాత ఎండలే!

తెలంగాణలో ఈదురు గాలులతో వానలు, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలెర్ట్ జారీ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ. మంగళవారం కూడా తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులతో రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలుపడే సూచనలున్నాయని చెప్పింది.

అదే సమయంలో రాగల మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని వివరించింది. గడిచిన 24 గంటల్లో వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షపాతం రికార్డైంది.

Tags

Next Story