Rains in Telangana : తెలంగాణలో ఈ నెల 23 వరకు వర్షాలు

Rains in Telangana : తెలంగాణలో ఈ నెల 23 వరకు వర్షాలు
X

తెలంగాణలో ( Telangana ) ఈ నెల 23 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం టెంపరేచర్లు ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇటు దక్షిణాదిలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ అదే రీతిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి.

మంగళవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్​లో 41.9 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో 41.7 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెంలో 41.5 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 41.3 డిగ్రీలు, సూర్యాపేట, జగిత్యాలల్లో 41.2 డిగ్రీలు, ఖమ్మంలో 40.6 డిగ్రీలు, సంగారెడ్డిలో 40.4 డిగ్రీలు, నిర్మల్​లో 40.3 డిగ్రీలు, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల్లోపే రికార్డయ్యాయి.

Tags

Next Story