TS : తెలంగాణలో రాబోయే 3రోజులు వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉరుములు, మెరుపులతో గంటకు 40-50కి.మీ.ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్లో వర్షాలు కురువవచ్చునని పేర్కొంది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఇక ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 12, మన్యంలో 10, అల్లూరి జిల్లాలోని 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అలాగే నెల్లూరు, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com