Rainfall : నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

Rainfall : నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ , ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిజామాబాద్ , రాజన్నసిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. నిన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షం కురిసింది.

అటు ఏపీలో వర్షాభావం కారణంగా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ నెమ్మదించింది. ఏపీలో వానలు అంతంతమాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. 11 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. 50వరకు మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులు ఖాళీగా ఉండటంతో సాగుకు ఇబ్బందవుతోందంటున్నారు. గోదావరి డెల్టాలో సాగు ఓ మాదిరిగా ఉండగా, కృష్ణా డెల్టాలో అసలు నారుమళ్లే పోయలేదని చెబుతున్నారు.

Tags

Next Story