TS : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈనెల 25 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. అనంతరం అది తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని, ఈనెల 26 నాటికి తుఫాన్ బెంగాల్ తీరానికి చేరుకోవచ్చని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒకవేళ తుఫాన్‌గా మారితే దీనికి ‘రెమాల్’ అని నామకరణం చేయనున్నారు. ఈ పేరును ఒమన్ దేశం సూచించింది. ‘రెమాల్’ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరంలోని ఎనిమిది దేశాలు తుఫాన్ పేర్లను నిర్ణయిస్తాయి. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక ఈ జాబితాలో ఉన్నాయి. 2018లో ఇరాన్, ఖతర్, యెమన్, సౌదీ, UAE చేరాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. ఇది రేపు తుఫానుగా మారే అవకాశముందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ELR, NTR, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com