TS : నా భార్యకు పోటీ చేయాలనే ఆలోచన లేదు : రాజగోపాల్ రెడ్డి

TS : నా భార్యకు పోటీ చేయాలనే ఆలోచన లేదు :   రాజగోపాల్ రెడ్డి

భువనగిరి పార్లమెంట్ నుంచి తన సతీమణి పోటీ చేస్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మండి పడ్డారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుటుందని హైకమాండ్ కు సూచించారు. మునుగోడు క్యాంప్ ఆఫీస్ లో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన సతీమణి అప్లికేషన్ పెట్టుకోలేదని ఆమెకు పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి కుటుంబం ఏనాడూ పదవుల కోసం ప్రాధేయపడలేదని హైకమాండ్ సూచన మేరకే పని చేశామని చెప్పారు. ఒకవేళ పార్టీ చేస్తున్న సర్వేల్లో తమకు అనుకూలంగా వస్తే ఆలోచిస్తా మన్నారు. తనకు మంత్రి పదవిపై హైకమాండ్ నుంచి హామీ ఉందని, వస్తే రాష్ట్రానికి సేవ చేస్తానని చెప్పారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అధికారం పోయిన షాకులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

హరీశ్ రావుకు కాళేశ్వరం టెన్షన్ పట్టుకుందని జైలుకెళ్తానని డిప్రెషన్లో ఉన్నాడని విమర్శించారు. కేటీఆర్ ఏ క్షణమైనా అమెరికా పారిపోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story