TS : బీఆర్ఎస్‌కు రాములమ్మ సపోర్ట్.. ట్విస్ట్ ఇచ్చిన విజయశాంతి

TS : బీఆర్ఎస్‌కు రాములమ్మ సపోర్ట్.. ట్విస్ట్ ఇచ్చిన విజయశాంతి
X

బీఆర్ఎస్‌ పార్టీపై రాజకీయ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదన్నారు విజయశాంతి. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అని వివరించారు.

తన ప్రకటనలో బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతూ స్పందించారు విజయశాంతి. రాజకీయాలు అర్థం చేసుకోలేనివారు... దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ వరకు ఇస్తున్న సమాధానాన్ని విశ్లేషించు కోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి సపోర్ట్‌ గా నిలిచారు.

దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చేయడం లేదని అన్నారు. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలిసి రావాలని అన్నారు విజయశాంతి.

Tags

Next Story