TS : రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నికకు రెడీగా ఉండు : కేసీఆర్

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం తాము పోరాటం చేస్తామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు సూచించారు. ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపునకు కృషి చేయాలని ఆదేశించారు. పార్టీ నేతలను, కేడర్‌ను సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని సూచించారు. కష్టపడేవారిని పార్టీ గుర్తింపు నిస్తుందని, గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య కూడా పిలుపు రావడంతో ములుగు మండలం నాగిరెడ్డిపల్లి శివారులోని ఓ ఫామ్ హౌస్లోకిరాజయ్య తన సన్నిహితులతో కలిసి వచ్చారు. ఎంపీ టికెట్ ఖరారు చేసిన తర్వాతే తాను కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తానని ఆ వ్యవసాయ క్షేత్రంలో కాసేపు వేచి చూశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com