TG : తెలంగాణలో తగ్గిన ప్రసూతి మరణాలు

TG : తెలంగాణలో తగ్గిన ప్రసూతి మరణాలు
X

గతేడాది ప్రసూతి మరణాలు తగ్గినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 2022-23లో 340 మరణాలు నమోదు కాగా, 2023-24లో 260కి తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ ప్రసూతి మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో TG మూడో స్థానంలో ఉంది. ప్రసూతి మరణాల్లో అత్యధిక శాతం ప్రసవించిన వారంలోపే జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గుండె సమస్యలు, ఊబకాయం, రక్తస్రావం, అబార్షన్ వంటివి కారణాలుగా చెబుతున్నారు.

రాష్ట్రంలో అత్యధిక ప్రసూతి మరణాలు ఉన్న జిల్లాల్లో సంగారెడ్డి మొదటి స్థానంలో ఉన్నది. ఆ జిల్లాలో 27 మరణాలు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌ ఉన్నాయి.

2022-23తో పోల్చితే గత ఏడాది మొత్తంగా మరణాలు తగ్గినా నిజామాబాద్‌, నారాయణపేట, మంచిర్యాల, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. మిగతా 27 జిల్లాల్లో తగ్గుదల నమోదైనట్టు నివేదిక తెలిపింది.

Tags

Next Story