Telangana 10th Exam Results : కాసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఇవాళ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో విద్యాశాఖ సెక్రటరీ బురా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
తెలంగాణ 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. మొత్తం 5.08,385 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది.
https://results.cgg.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ పదవ ఫలితాలను కనుగొనవచ్చు. విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేస్తే, ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాలతోపాటు మార్కుల మెమో ఉంటుంది. గతేడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న ముగియగా.. మే 10న ఫలితాలు విడుదలయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com