MPDO Office : కిరాయి కట్టలేదని కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయానికి తాళం

బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయానికి ( MPDO Office ) తాళం వేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మండలాల విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలం నుండి విడిపోయి కన్నెపల్లి మండలంగా ఏర్పడిన తర్వాత మండలానికి కావాల్సిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
దాంతో మండల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు రూ.4,500 అద్దె చొప్పున జులై 2018లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుండి 12 నెలల కిరాయి చెల్లించిన ప్రభుత్వం గత 26 నెలలుగా కిరాయి చెల్లించకపోవడంతో బిల్డింగ్ యజమాని గంగ మురళీధర్రావు తాళం వేశారు.
తనకు రావాల్సిన అద్దె డబ్బులు చెల్లించాలని అడిగితే అధికారులు కాలం వెల్లదీస్తున్నారు గానీ అద్దె డబ్బులు ఇవ్వడం లేదని, అద్దె రూపంలో తనకు రూ.1.17లక్షల కిరాయి రావాల్సివుందని, ఎంత అడిగినా అదే చెప్పడంతో కిరాయి డబ్బులు ఇచ్చేంత వరకు కార్యాలయానికి తాళం తీసేది లేదని బీష్మించుకొని కూర్చున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com