TS : రేవంత్ 2.0.. ఇది వేరే లెవెల్

TS : రేవంత్ 2.0.. ఇది వేరే లెవెల్

వంద రోజుల పాలన అయిపోవడం.. లోక్ సభ నోటిఫికేషన్ రావడం ఒకేసారి జరిగిపోయాయి. దీంతో.. హైదరాబాద్ లో మీట్ ద ప్రెస్ లో పాల్గొన్న సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన ఫ్యూచర్ ప్లాన్స్ పై సిగ్నల్స్ ఇచ్చారు. రాబోయే రెండు నెలలు విశ్వరూపమే ఉంటుందని తెలిపారు. "మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుంది" అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలను ఆచరణలో పెట్టేశారు. నిన్నమొన్నటివరకు లీకులు, కండువాలు కప్పుకునేవరకు మాత్రమే స్టేట్ మెంట్లు ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఇపుడు కారుదిగి కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు.

ఓవైపు.. వలసల దెబ్బ.. మరోవైపు.. కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలకనేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఢిల్లీలోనే ఉంటూ పార్టీపై దృష్టిపెట్టలేని పరిస్థితి. ఈ సిట్యుయేషన్ అసంతృప్త బీఆర్ఎస్ నేతలకు వరంగా మారింది. పార్టీ మారేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నారు గులాబీ డిజప్పాయింటెడ్ లీడర్లు.

కాంగ్రెస్ లో వలసల జోరు కనిపిస్తోంది. మాజీ ఎంపీ జితేందర్, ఎంపీ పసునూరి దయాకర్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడంతో ఈ చేరికలు ఊపందుకున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు వరదలా వస్తారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఎన్నికలలోపు అందరూ చేరడం పూర్తి కాగానే, గ్రేటర్‌ నుంచి ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా ఇస్తారనే టాక్‌ నడుస్తోంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలువాలనే ఎన్నికల వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్‌ నాలుగు నియోజకవర్గాలకే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ఆపింది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వచ్చే అవకాశం ఉండటంతో వారి కోసమే టికెట్లను ఆపిందని ఆ వర్గాలు అంటున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు కలిసి కట్టుగా బీఆర్‌ఎస్‌ ఎల్‌పీని సీఎల్పీలో విలీనం చేస్తారనే టాక్‌ వైరల్‌ అవుతున్నది. అయితే కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకున్న వారు అసంతృప్తికి గురి కాకుండా కాంగ్రెస్‌ ముందుస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 37 కార్పొరేషన్లకు చైర్మెన్లను ప్రకటించి జాతరను తలపించింది.

Tags

Read MoreRead Less
Next Story