TS : తెలంగాణ యూనివర్సిటీలకు ఇంచార్జ్ వీసీలు వీరే

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు వైస్ ఛాన్సులర్ల పదవీకాలం ముగియడంతో ఇన్ఛార్జ్ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలను నియమించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇంఛార్జ్ వీసీలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా దాన కిషోర్ నియమితులయ్యారు.
జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీగా బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా కరుణ వాకాటి, తెలంగాణ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా సందీప్ సుల్తానియా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా రిజ్వి, పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా శైలజ రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా సురేంద్రమోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీగా నదీం అహ్మద్ ను నియమించింది రేవంత్ సర్కార్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com