TS : రేవంత్ సర్కార్ చాలా స్ట్రాంగ్.. కూలే చాన్సే లేదన్న ఖర్గే

TS : రేవంత్ సర్కార్ చాలా స్ట్రాంగ్.. కూలే చాన్సే లేదన్న ఖర్గే
X

కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందనీ.. కూలిపోయే పరిస్థితి లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతున్నదని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్డు ఖర్గే రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందని, ఐదేళ్ల పాటు తమ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

నిరాశలో ఉన్నవారే ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు ఖర్గే. శుక్రవారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ క్రిష్ణాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్ అంటే బీజేపీకి భయం పట్టుకుందని, అందుకే మతాన్ని రాజకీయాల్లోకి లాగుతోందని ఖర్గే ధ్వజమెత్తారు. అబద్ధాలతో మోదీ దేశ ప్రజల దృష్టి మరిల్చే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలకు మోదీ సర్దార్ కేరాఫ్ అని సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతో చెబుతుందో అది కచ్చితంగా చేసి చూపిస్తుందన్నారు. కర్నాటకలో, తెలంగాణలో తామిచ్చిన హామీలు నెరవేర్చామన్నారు.

Tags

Next Story