TG : నా కోసం రేవంత్ పెట్టిన 11 సభలు అట్టర్ ఫ్లాప్..: డీకే కౌంటర్

తన ఓటమి కోసం మహబూబ్ నగర్ లో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి శతవిధాలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ. మంత్రి పదవులు లాబీయింగ్ చేస్తే రావని, అవి పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు వస్తాయని స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి కోసం తాను లాబీయింగ్ చేయనని, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానని చెప్పారు.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆమె చిట్ చాట్ చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని 14 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని చెప్పిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడేమైందని, ఫలితాలపై ఏం వ్యాఖ్యానిస్తారని సీఎంను ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని, మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైనందుకు సీఎం పదవి నుంచి రేవంత్ వైదొలగాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ ఎంపీ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి తానే అభ్యర్థిగా ప్రచారం చేసినా తనను ఓడించలేకపోయారని ఎద్దేవా చేశారు. 11 సభలు పెట్టినా ఫలితం రాలేదన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు కొందరు నేతలు ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com